మీ అభిమాన పంచాంగ గణిత కర్త
పండిత శ్రీ ఉంగరాల అప్పారావు నాయుడు సిధ్దాంతి



శుభవార్త

జాతక ఫలిత భాగము అందుబాటులో ఉంది.

ఫలిత భాగములో గ్రహ భిందువులు, దశావస్థలు, సమయ ఫలాలు, గ్రహ విచారణ, భావ విచారణ, ఏలినాటి, అర్దాష్టమ, అష్టమ శని సంచార కాలములు, కాల సర్ప దోషము, విద్యా, వివాహ, ధన, గృహ, భూ, వాహన, విదేశీ అంశములపైన విచారణ, యోగ పరిశీలన, వంశోత్తరి దశ భుక్తి ఫలముల వివరములు కలవు.



శ్రీరస్తు                                             శుభమస్తు                                             అవిఘ్నమస్తు


శ్లో||   శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం                 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

శ్లో||   ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ             
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః              

జ్యోతిష శాస్త్రము దాని ఆవశ్యకత:- గతజన్మలలో చేసుకొన్న కర్మ ఫలితాన్ని అనుభవించవల్సివుండగా ఏఫలితాన్ని ఏసమయంలో అనుభవించవల్సి వుంటుందో జ్యోతిష శాస్త్రము తెలుపు తుంది.

జాతకంద్వార చెడు సమయాన్ని గుర్తించి ఆసమయంలో నిర్ణయాలు తీసికొనేటప్పుడు పునరాలోచన చేసి దానాది శాంతి సత్కర్మల ద్వారా నివారణచర్యలు చేసి దోషాన్ని పరిహరించుకొని సుఖ జీవనము ఏర్పాటుచేయబడినదే జ్యోతిషం. జాతకములో వున్నదితప్పక అనుభవించి తీరాలనే అభిప్రాయము కాదు. అనుభవించడమే తప్పనిసరి యైతే దానిని తెలిసుకొని ప్రయోజనములేదు. మంచి ఫలితాన్ని ముందుగా తెలిసికొనడంవల్ల క్రియాశీలత లోపించడం, చెడుఫలితాలను ముందుగా తెల్సికొనడంవల్ల యిప్పటనుండి విచారించడం శాస్త్ర ప్రయోజనంకాదు. రాబోయే మంచి ఫలితాన్ని జాతకం ద్వారా తెలిసుకొని దానికి అనుగుణముగా కృషి చేసి పూర్తి ఫలితాన్ని పొందడం. దుష్పలితాలను తెలిసికోవడంవల్ల దానికి వ్యతిరేకదిశలో కృషి చేసి శాంతిక్రియలు ద్వారా తొలగించడం కాని లేదా తగ్గించు కోవడానికి ప్రయత్నించి సుఖజీవనమును అనుభవించవలెను.

స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మేణేభ్యః శుభమస్తు నిత్యం లోకా స్సమస్తా సుఖినోభవంతు||

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

X
శుభవార్త

మన తెలుగు వారికి సులభంగా అర్దం అయ్యెటట్లుగా పంచాంగ గడియారం మొట్టమొదటిసారిగా మేము ప్రవేశపెట్టాము.

పంచాంగ గడియారము ప్రస్తుత సమయముకు ఉన్న తిది, నక్షత్రం, నక్షత్ర పాదం, హోర వివరములుతో పాటుగా ముహూర్త మరియూ అశుభ సమయములును మీరు ఉన్న ప్రాంతమునకు చూపిస్తుంది.

ప్రస్తుత సమయము ముహూర్త సమయం అయితే గడియారం ఆకుపచ్చ రంగులోనూ, అశుభ సమయం అయితే గడియారం ఎరుపు రంగులోనూ కనపడుతుంది.

    
https://www.todaypanchangam.com

సూచన : మా వెబ్ సైట్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ( Google Chrome browser ) లో ఖచ్చితముగా అన్ని పనిచేస్తాయి. కావున గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని వాడండి.